Header Banner

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

  Sat May 31, 2025 09:06        Others

ఏపీలో వర్షాలు పడతాయంటోంది వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. 'వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయ, జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు.

మరోవైపు రుతుపవనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం సాయంత్రానికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5 మి.మీ., వేపాడలో 79 మి.మీ., అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74 మి.మీ.లు, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతేకాదు శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉదయం ఎండ తీవ్రత, ఉక్కపోత కూడా ఉంది.


ఇది కూడా చదవండి: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో సమస్యలు..! అక్కడకు క్యూ, మీరు కూడా ఉన్నారా?


అలాగే సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీడయడంతో మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారింది. రాష్ట్రంలో పలుచోట్ల మేఘాలు ఆవరించి పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడ్డాయి. అయితే బంగాళాఖాతంలో అలల ఉధృతి కనిపించింది. కోస్తా తీర ప్రాంతంలో వెంట బలమైన గాలులు వీస్తుండడంతో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ఇదిలా ఉంటే.. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో సముద్రం కూడా అల్లకల్లోకంగా ఉంది. విశాఖపట్నంలోని ఆర్కేబీచ్‌తో పాటుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో తీరంలో అలలు భారీగా ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అలాగే విశాఖపట్నంలో సముద్ర గాలుల దెబ్బకు బీచ్‌ రోడ్డు మొత్తం పొగమంచుతో కమ్మేసింది. విశాఖపట్నంలో చల్లని వాతావరణంలో సందర్శకులు, స్థానికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటంతో వర్షాలు కొనసాగతాయటున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..



వంశీ ఆస్పత్రి తరలింపుపై సస్పెన్స్ కొనసాగింపు..! హైకోర్టు ఆదేశాల కోసం..!


నిరుద్యోగులకు అలర్ట్..! హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

భార‌త్‌లో యాపిల్ మూడో స్టోర్..! ఎక్క‌డో తెలుసా?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #APWeatherAlert #HeavyRainWarning #AndhraPradeshRains #WeatherUpdate #RainAlert #IMDWarning